Peddha Peddha Kallathoti歌詞
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!
చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే
పుట్టలోన వేలు పెడితే చీమ కొట్టినట్టు
నన్ను పట్టి కుట్టాయిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
~ సంగీతం ~
ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే
తెలుగులో ఛందస్సు చడవలేదే
హిందీలో షాయిరి మనకు రాదే
నాలో ఈ కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న
వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా
ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పాడుతున్న
పాతికెళ్లకొచ్చాక నడక నేర్పినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
~ సంగీతం ~
భూకంపమంటే భూమి ఊగిపోవడం
సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం
ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంటిలోన వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికిపాటు పెరు కలవరం
ఈరెంటికన్నా చాలా వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే కలవరించడం
ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్లు కుందిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!
專輯歌曲
所有歌曲
1.Peddha Peddha Kallathoti
熱門歌曲
Yazin Nizar熱門專輯
更多專輯